ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం కొత్త విధానం

ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం కొత్త విధానం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే సమారు 26 వేల ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ పాఠశాలలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే సమారు 26 వేల ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు ఉపాధ్యాయులు వంతుల వారీగా సెలవులు పెట్టుకుంటున్నారు. కానీ సెలవు రోజుల్లో కూడా రిజిస్టర్లలో సంతాకాలు ఉండడం అధికారులు గమనించారు. దీన్ని అరికట్టడానికి అన్ని రంగాల్లో అమలు చేసినట్టుగానే, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పాఠశాలలో కూడా అమల్లోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఈ విధానం 12 జిల్లాల్లో ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులకు అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా గతంతో పోలిస్తే వీరి హాజరు శాతం బాగా పెరగిందని అధికారులు తెలియజేసారు. ఇదే విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో వాడుకలోకి తేవాలని ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయుల కోసం ఈ విధానం రానుంది. కాకపోతే అన్ని పాఠశాలలకు ఒకేసారి ఇన్ని బయోమెట్రిక్‌ యంత్రాలు సమకూర్చడం కష్టమే.

ఈ నేపథ్యంలోనే 12 జిల్లాల్లో విద్యార్థుల కోసం ఏర్పాట్లు చేసిన బయోమెట్రిక్‌ మిషన్లను తొలగించి, రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల కోసం మాత్రమే ఉపయోగించాలని భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలోనూ రెండేళ్ల నుంచి టీచర్లకు బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేసారని, అది విజయవంతంగా అమలైందని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories