బస్తీ దవఖానాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు

బస్తీ దవఖానాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు
x
Highlights

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బస్తీవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని బస్తీ దవఖాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బస్తీవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని బస్తీ దవఖాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఆ ఆస్పత్రుల్లో పనిచేయడానికి ప్రభుత్వం వైద్య సిబ్బంధిని నియమించనున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని బస్తీ దవఖానలకు మెడికల్‌ అధికారి, స్టాఫ్‌ నర్సు పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈనెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సెల్ఫ్‌ అటెస్టేషన్‌తో కూడిన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను జతపరిచి దరఖాస్తు ఫారాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో, ఫిల్లర్‌ నంబర్‌ 294, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, మణికంఠ కాలనీ, శివరాంపల్లి, రాజేంద్రగనర్‌, రంగారెడ్డి జిల్లా చిరునామాకు పోస్టు ద్వారా గానీ వ్యక్తిగతంగా అందజేయాలని సూచించారు.

ఈ ఆస్పత్రుల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండి, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో సభ్యులుగా వారి పేరు నమోదై ఉండాలి. వీరికి ప్రభుత్వం నెలకు రూ.42వేల గౌరవవేతనం ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.

వారితో పాటుగానే నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం పూర్తి చేసి తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలని తెలిపారు. వీరిలో స్టాఫ్‌ నర్సుకు నెలకు రూ.21వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌ వివరాలను తెలుసుకోవడానికి www.rangareddy.telangana.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories