మున్సిపోల్స్..మొదటి దశ రిజర్వేషన్లు పూర్తి

మున్సిపోల్స్..మొదటి దశ రిజర్వేషన్లు పూర్తి
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నగారా మోగింది.

తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో మొదటి దశ రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం పూర్తయింది. ఈ సందర్భంగానే రిజర్వేషన్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వం శనివారం జిల్లా కలెక్టర్లకు పంపించింది. ఆయా వర్గాల వారీగా మున్సిపల్‌ వార్డుల రిజర్వేషన్లను పూర్తి చేసిన ప్రభుత్వం

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు పదవుల్లో రిజర్వేషన్లను కల్పించింది. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కల్పించారు. ఎస్టీల జనాభా ఒక్కశాతం తక్కువగా ఉన్నా కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. ఇక ఆదివారం వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం.

ఇప్పటికే ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడు వెలువడుతుందా అని ఎదురు చూసిన అబ్యర్థులు దీంతో అప్రమత్తమవుతున్నారు. ఎలక్షల ప్రచారాన్ని ఎలా కొనసాగించాలో వ్యూహాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. మంచి పదవులలో ఉన్న కొంత మంది సీనియర్ నాయకులు వారికి పిల్లలను, జీవిత భాగస్వాములను ఎన్నికల బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories