రైతులకు గుడ్ న్యూస్... రైతుబంధు దరఖాస్తు చేసుకోడానికి మరో అవకాశం

రైతులకు గుడ్ న్యూస్... రైతుబంధు దరఖాస్తు చేసుకోడానికి మరో అవకాశం
x
Highlights

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి కబురు చెప్పింది. ఎంతో మందికి అండగా నిలుస్తున్న రైతుబంధు పథకం కోసం ఇప్పటి వరకు కొంత మంది రైతులు దరఖాస్తు...

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి కబురు చెప్పింది. ఎంతో మందికి అండగా నిలుస్తున్న రైతుబంధు పథకం కోసం ఇప్పటి వరకు కొంత మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు. అలాంటి రైతులు దరఖాస్తు చేసుకోడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాదే జనవరి నెలలో కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు, ఇంతకు ముందే పాస్ పుస్తకాల ఉండికూడా దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 13వ తేదీ లోగా రైతుబంధుకోసం రైతులు దరఖాస్తుచేసుకోవచ్చని వ్యవసాయశాఖ వెల్లడించింది.

రైతులు దరఖాస్తు ఫారంతో పాటు భూమి పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్(సేవింగ్స్ అకౌంట్), ఎమ్మార్వో డిజిటల్ సంతకం చేసిన పేపర్ జోడించాలని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తోంది. ఖరీఫ్, రబీ ఈ రెండు సీజన్లకుగాను ఎకరానికి రూ. 5000 చొప్పున రూ. 10,000లను రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. ఇక రైతులు అందిస్తున్న ఈ రుణానికి ఆరు నెలల తర్వాత అంటే 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. ఇక నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories