ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు తెలంగాణ సర్కార్‌ ఝలక్

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు తెలంగాణ సర్కార్‌ ఝలక్
x
కేసీఆర్
Highlights

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. యూనియన్ నేతలకు ఇచ్చే అన్ని రకాల ఆన్ డ్యూటీ సౌకర్యాలను రద్దు చేసింది. దాంతో,...

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. యూనియన్ నేతలకు ఇచ్చే అన్ని రకాల ఆన్ డ్యూటీ సౌకర్యాలను రద్దు చేసింది. దాంతో, కొద్దిమందికైనా ఆన్ డ్యూటీ సౌకర్యం ఇవ్వాలంటూ యూనియన్ సంఘాల నేతలు వేడుకుంటున్నారు.

యూనియన్లు అంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో యూనియన్లపై కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. చివరికి ఆర్టీసీ సమ్మెపైనా, యూనియన్లపైనా పైచేయి సాధించిన కేసీఆర్‌ ఆ తర్వాత అసలు యూనియన్లే ఉండొద్దంటూ మాట్లాడారు. దాంతో ఆర్టీసీ యూనియన్ల ఉనికే ప్రశ్రార్ధకంగా మారింది. అయితే, ఇదే తరహాలో అన్ని ఉద్యోగ సంఘాలపై ఉక్కుపాదం మోపబోతోందని తెలుస్తోంది.

ఇక, ఇంటర్ బోర్డు వ్యవహారంతో జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘాన్ని, ఇతర సంఘాలను నామరూపాలు లేకుండా చేశారు. దాంతో, ఉపాధ్యాయ సంఘాలు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నాయి. అయితే, యూనియన్ సంఘాల నేతలు విధులకు వెళ్లకుండా మినహాయింపు ఉంటుంది. దాదాపు 25మంది రాష్ట్రస్థాయి నేతలకు ఆన్ డ్యూటీ సౌకర్యం ఉంది. జిల్లాస్థాయి నేతలు కూడా అధికారులను మేనేజ్ చేసుకుని అనధికారికంగా ఆన్ డ్యూటీలో కొనసాగుతున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలకు ఉన్న అన్ని రకాల ఆన్ డ్యూటీ సౌకర్యాలను రద్దు చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని ఉద్యోగ ఉపాధ్యాయ నేతలను ఆదేశించింది. జిల్లా స్థాయిలో కూడా ఎవరికీ అనధికారిక ఆన్ డ్యూటీ సౌకర్యం ఇవ్వొద్దని కలెక్టర్లకు, డీఈవోలకు, ఇతర అధికారులకు ఆర్డర్స్ ఇచ్చింది. దాంతో, కొద్దిమందికైనా ఆన్ డ్యూటీ సౌకర్యం ఇవ్వాలంటూ యూనియన్ సంఘాల నేతలు వేడుకుంటున్నారు.

అయితే, యూనియన్ల నేతలకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కానీ, యూనియన్ నేతల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోందని అంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories