ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్దికి ఏర్పాట్లు

ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్దికి ఏర్పాట్లు
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తుంది. దాంతో పాటుగానే పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఎంతో సహకారాన్ని కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది.

కేంద్రం ప్రవేశపెట్టిన క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (సీడీపీ) కింద వీటిని చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఇప్పటికే ఉన్న ఎమ్మెస్‌ఎంఈ పార్కులలో 17 పార్కులను అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. వాటిలో ముఖ్యంగా వరంగల్‌, సుల్తాన్‌పూర్‌ ఫిక్కి లేడీ ఆర్గనైజేషన్‌ పార్కు, బుగ్గపాడు, కళ్లెం, కుందన్‌పల్లి, భువనగిరికి సంబంధించన ఆరు క్లస్టర్లు ఉన్నాయి వాటి ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి ఇప్పటికే పంపారు.

వీటిని అభివృద్ది చేయడానికి రూ.54 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఇందులో రూ.42 కోట్లు కేంద్రం వాటా, రాష్ట్రం వాటా రూ.12 కోట్లు. మిగిలిన 11 పార్కులు సహా గద్వాల, హయత్‌నగర్‌, జడ్చర్ల, చిట్యాల, రామగుండం, మంచిర్యాల, హైదరాబాద్‌లో మరికొన్నింటినికి కూడా తెలంగాణ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇందుకు గాను కేంద్రం 60 నుంచి 75 శాతం వరకు నిధులను గ్రాంట్‌గా ఇస్తున్నది.

వాటిలో ఒక్కో పార్కుకు రూ.15 కోట్లు గరిష్ఠ గ్రాంట్‌గా కేంద్రం ఇవ్వనుందని భావిస్తున్నారు. ఇక మిగతా ఎంతయితే బడ్జెట్ అవసరం ఉంటుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. కేంద్రం అందిస్తున్న ఈ గ్రాంట్లతో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, నీరు, విద్యుత్‌ సరఫరా, కామన్‌ ఫెసిలిటి సెంటర్ల (సీఎఫ్సీ) ఏర్పాటు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. ఇక ఎన్నో ఏల్లనాటి పారిశ్రామిక పార్కులను అప్‌గ్రేడ్‌ చేయడం వల్ల కొత్త టెక్నాలజీకి కావాల్సిన శిక్షణ ఇచ్చేందుకు సీఎఫ్సీలు ఉపయోగపడనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories