ఒక ట్వీట్ ఎంతో మంది కడుపు నింపింది...

ఒక ట్వీట్ ఎంతో మంది కడుపు నింపింది...
x
Highlights

రాష్ట్రంలో లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వలస కూలీలకు పనులు దొరకక, అన్న పానీయాలు లేకుండా కష్టపడుతున్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వలస కూలీలకు పనులు దొరకక, అన్న పానీయాలు లేకుండా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీహార్ కు చెందిన వలస కూలీలు సుమారుగా 200 మంది చిలకలగూడలో ఉంటున్నారు. కాగా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుందని, అన్న పానీయాలు కూడా దొకడం లేదని రని కేశవ్‌ కుమార్‌ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ కు ట్విట్ చేసారు.

ఈ విషయం గ్రహించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు ట్వీట్‌ చేశారు. బీహార్‌కు చెందిన కొంత మంది వలస కూలీలు సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో నివసిస్తున్నారని, వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపారు. దీంతో స్పందించిన డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుందని తెలిపారు. వారందరినీ లాక్‌డౌన్‌ ముగిసే వరకు జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన కుమారుడి చేతుల మీదుగా కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేయించారు.

ఈ సందర్భంగా వలసకూలీలు డిప్యూటీ స్పీకర్‌తో పాటు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఇక పోతే కరోనా వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా గంటగంటకు మరణ మృదంగం మోగుతుంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి 37,814 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తం 7,85,715 మందికి ఈ వైరస్ సోకింది. ఇటలీ, అమెరికా, ఇరాన్, వంటి దేశాల్లో ఈ వైరస్ కేసుకు అధికంగా ఉన్నాయి. ఇక మనదేశంలో కోవిడ్ కేసులు వెయ్యి దాటాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories