కూరగాయలు, సరకులు హోం డెలివరీ.. ఎప్పటి నుంచి అంటే

కూరగాయలు, సరకులు హోం డెలివరీ.. ఎప్పటి నుంచి అంటే
x
Highlights

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే లోకల్ కాంటాక్ట్ ద్వారా పాజిటివ్ వచ్చిన కేసుల సంఖ్య 5కి చేరుకుంది.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే లోకల్ కాంటాక్ట్ ద్వారా పాజిటివ్ వచ్చిన కేసుల సంఖ్య 5కి చేరుకుంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ప్రజలు బయటికి వెల్లే అవసరం లేకుండా ప్రభుత్వం సరకులు, కూరగాయల వంటివి ఇళ్ల వద్దకే పంపడానికి ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచే ఇండ్ల వద్దకు కూరగాయల సరఫరాకు చేయడానికి కొన్ని వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సమయం చూసుకుని నిత్యావసర వస్తువులను కూడా ఇళ్ల వద్దకే పంపించే ఏర్పాట్లను కూడా చేస్తోంది.

ఇక రాష్ట్రంలో వైరస్ రెండో దశకు చేరుకోవడంతో ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించింది. ఎవరినీ బయటికి వెల్లొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా చాలా మంది నిత్యావసర వస్తువుల కోసం బయటికి రావలసి వస్తుంది. కానీ కొన్ని చోట్ల పోలీసులు వారిని మధ్యలోనే ఆపి తిరిగి వెనకకి పంపిస్తున్నారు. మరికొన్ని చోట్ల కొంత మంది పోలీసు కట్టడిని దాటుకొని, దొంగచాటుగా రెతు బజార్లకు వెళ్లుతులన్నారు. బజార్లలో గుంపులు గుమ్మిగూడుతున్నారు.

దీంతొ ఎవరికైనా వైరస్ ఉంటే అందరికీ సోకుతుందేమో అని అదికారులు భయపడుతున్నారు. రైతుబజార్లలో ప్రజలు సామాజిక దూరం పాటించనందుకే ఈ నిర్ణయం తసుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాల్లో సంచార కూరగాయల అమ్మకాలు మొదలు పెడితే వైరస్ ఒకరి నుంచి మరోకరికి సోకదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం వాహనాలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే 200 నుంచి 300 వాహనాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ వాహనాల మీద రైతుబజార్లలో ఉండే అమ్మకం దారులు వాహనాలపై చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి అమ్ముకొనేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఒక్క కాలనీకి రెండు మూడు రోజులకోసారి వెల్లాలని ప్లాన్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories