కొత్త మద్యం పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

కొత్త మద్యం పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
x
Highlights

కొత్త లిక్కర్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

కొత్త లిక్కర్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ విడుదల చేశారు. 2216 మద్యం దుకాణాల ఏర్పాటుకు సర్కార్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ఫీజును లక్షా నుంచి రెండు లక్షల రుపాయలకు పెంచింది. కొత్త మద్య విధానం ఒకటి నవంబర్ 2019 నుంచి అక్టోబర్ 2021 వరకు అమలులో ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాలలో రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరచి ఉంటాయి. ఈ నెలాఖరులోగా లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్స్‌ దారుల ఎంపిక ఉంటుందని సోమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories