నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అసెంబ్లీలో ప్రారంభమైన వేడుకలు

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అసెంబ్లీలో ప్రారంభమైన వేడుకలు
x
Highlights

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేటికి ఆరు ఏండ్లు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెట్టింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేటికి ఆరు ఏండ్లు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెట్టింది. ఏడో ఆవిర్భావ దినోత్సవాన్నిపురస్కరించుకుని అసెంబ్లీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత శాసనసభ వద్ద పోచారం, శాసనమండలి వద్ద గుత్తా జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రజల దశాబ్దాల కల అని ఆయన అన్నారు. ఈ కలను తెలంగాణ సీఎం కేసీఆర్ పోరాడి సాధించారని తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు.ఇక ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మరికాసేపట్లో గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇక ఇప్పటికే పల్లె నుంచి పట్నం దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆవిర్భావ దినోత్సవాలు మొదలయ్యాయి. అయితే ప్రతి ఏడాది హంగు ఆర్భాటాలతో నిర్వహించే వేడుకలను ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories