తెలంగాణ అటవీశాఖ కీలక నిర్ణయం..

తెలంగాణ అటవీశాఖ కీలక నిర్ణయం..
x
Highlights

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హరిత హారం పేరుతో ప్రభుత్వం ఎన్నో మొక్కలను నాటించింది. అంతే కాక నాటిన మొక్కలను నీళ్లు పోసీ కాపాడాలని సిబ్బందిని...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హరిత హారం పేరుతో ప్రభుత్వం ఎన్నో మొక్కలను నాటించింది. అంతే కాక నాటిన మొక్కలను నీళ్లు పోసీ కాపాడాలని సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. చెట్లు నాటడం పర్యావరణాన్ని పరిరక్షించ వచ్చిన, దానిక ద్వారా వాయు కాలుష్యాన్ని పోగొట్టి, వర్షాలను పెంచవచ్చిన ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి మొక్కల్ని సంరక్షిస్తుంది. కానీ కొంత మంది అడవిలోకి దొంగతనంగా వచ్చి అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. ఎవరి కంటా పడకుండా చెట్లను నరికేస్తున్నారు. దీంతో అటవీ సంపద అంతా తరిగిపోతుంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ అటవీశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అడవులలో జరిగే స్మగ్లింగ్ ని అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అడవులపై ఇక నుంచి డ్రోన్లతో నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఇక మీదట అటవీశాఖ అధికారుల, సెక్యూరిటీల కల్లుగప్పి విలువైన అటవీ సందపను దోచుకెళ్తున్నారు వారికి చెక్ పెట్టనున్నారు. అంతే కాక డ్రోన్‌లతో అడవుల పెంపకంపైన కూడా దృష్టిపెట్టారు. దాంతోపాటు గానే పెద్ద మొత్తంలో సీడ్ బాల్స్ తయారు చేసి.. వర్షాకాలంలో డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లబోతున్నారు. దీంతో అటవీ ప్రాంతంలో కొత్త మొక్కలు మొలిచి అటవిలో చెట్ల అభివృద్ది జరగనుంది. ఈ విధంగా హరితహారం కార్యక్రమాన్ని కొనసాగింపు చేయనుంది. ఇందులో భాగంగానే రోజుకు సుమారు లక్ష విత్తనాలు చల్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తద్వారా అడవుల్లో వృక్ష సంపదను పెంచాలని భావిస్తోంది. ఇక పోతే ఇప్పటికే ఈ విధానాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉన్న అటవిపైన కెమెరాలను ప్రవేశపెట్టారు. ఈ డ్రోన్ కెమెరాలతో పోలీసులు, అటవీశాఖ అధికారులు నిఘాను కేంద్రీకరించారు. టేకు చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి కదలికలు జరిగినా తమకు సమాచరం వస్తుందని వెల్లడించారు. ఇందుకు గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియో ట్యాగింగ్ చేసిన డ్రోన్లను ఉపయోగిస్తున్నామని స్పష్టం చేసారు. ఇక ఈ కెమెరాల వలన అటవీ సందను పెంచుకోవడే కాకుండా స్మగ్లర్ల బారినుంచి కూడా చెట్లను కాపాడుకునే అవకాశం కలుగుతుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories