జయశంకర్‌ జీ.. దయచేసి అతనికి సహాయం చేయండి.. కవిత ట్వీట్‌

జయశంకర్‌ జీ.. దయచేసి అతనికి సహాయం చేయండి.. కవిత ట్వీట్‌
x
Ex MP Kavitha(File photo)
Highlights

పొట్టకూటికోసం, బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో మైళ్ల దూరం ప్రయాణం చేసి సౌదీ అరేబియాకు చేరుకున్నాడు ఓ వ్యక్తి. అక్కడ కష్టపడి సంపాదించి కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా పోషించాలనుకున్నాడు.

పొట్టకూటికోసం, బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో మైళ్ల దూరం ప్రయాణం చేసి సౌదీ అరేబియాకు చేరుకున్నాడు ఓ వ్యక్తి. అక్కడ కష్టపడి సంపాదించి కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా పోషించాలనుకున్నాడు. కానీ అక్కడి పరిస్థితులు అతను అనుకున్న దానికి భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ నుంచి పనికోసం వెళ్లిన వ్యక్తి తన యజమాని నుంచి వేధింపులకు గురవుతున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియని అతను తనను కాపాడాలని కోరుతూ ఓ వీడియోను పోస్టు చేశాడు.

పూర్తివివరాల్లోకెళ్తే తెలంగాణకు చెందిన రవి అనే వ్యక్తి ఉపాధి కోసం కొన్నేండ్ల క్రితం కుటుంబాన్ని వదిలేసి సౌదీ అరేబియాకు వెళ్లాడు. కాగా అతని యజమాని కొద్ది రోజులుగా రవిని వేధింపులకు గురి చేస్తుండడంతో బాధితుడు దీనంగా తనను కాపాడాలని కోరుతూ ఓ వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియోనే చూసి స్పందించిన మాజీ ఎంపీ కవిత స్పందిస్తూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు. రవి సౌదీ అరేబియాలో చిక్కుకున్నాడు. అతన్ని రక్షించేందుకు వారం రోజుల నుంచి తమ ఎంబసీ ద్వారా ప్రయత్నిస్తున్నాం. ఈ సమయంలో మీరు జోక్యం చేసుకోవాలి. దయచేసి రవికి సహాయం చేయాలని జైశంకర్‌కు కవిత విజ్ఞప్తి చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories