Top
logo

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన టీఈఏ

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన టీఈఏ
Highlights

తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(టీఈఏ) ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌...

తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(టీఈఏ) ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వద్ధామరెడ్డి టీఈఏ నేతలను కలిసి మద్దతు కోరారు. ఈ క్రమంలో సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు టీఈఏ అధ్యక్షుడు సంపత్‌ కుమార స్వామి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మిగతా ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను సంఘటితంగా ఏకం చేసి పోరాటం ఉధృతం చేస్తామని వివరించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story