నకిలీ సర్టిఫికెట్లకు స్వస్థి..టెన్త్‌ మెమోలపై క్యూఆర్‌ కోడ్‌

నకిలీ సర్టిఫికెట్లకు స్వస్థి..టెన్త్‌ మెమోలపై క్యూఆర్‌ కోడ్‌
x
QR Code
Highlights

కొంత మంది కొన్ని కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించడం కోసం నకిలీ మెమోలను, నకిలీ ధృవపత్రాలను చూపిస్తూ ఉంటారు.

కొంత మంది కొన్ని కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించడం కోసం నకిలీ మెమోలను, నకిలీ ధృవపత్రాలను చూపిస్తూ ఉంటారు. ఒరిజినల్ సర్టిఫికెట్లకు, డూప్లికేట్ సర్టిఫికెట్లకు కొంచం కూడా తేడా లేకుండానే అవి కనిపిస్తాయి. దీంతో చాలా కంపెనీలలో యాజమాన్యం వారికి ఉద్యోగాలు ఇస్తుంది. పనిపై సరైన అవగాహన లేకుండా వారు పనిలో చేరడం వలన కంపెనీలలో కొంత మేర నష్టం కలుగుతుందనే చెప్పుకోవాలి. ఇక ఇలాంటి సర్టిఫికెట్ లను అరికట్టడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు అందజేసిన మెమోలు నకిలీవా? అసలైనవా? అని గుర్తించేందుకు ఈ విధానాన్ని తీసుకువస్తోంది.

ముందుగా ఈ ప్రయత్నం పదో తరగతి మెమోల నుంచి మొదల పెట్టింది ప్రభుత్వం. పదో తరగతి నకిలీ మెమోలను అరికట్టేందుకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఎక్కువ మంది నకిలీ సర్టిఫికెట్లను మార్ఫింగ్ చేయించుకోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులో భాగంగనే ఇకపై క్యూఆర్‌ కోడ్‌ ను పదో తరగతి మెమోలపై పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకూ 2004 నుంచి పదో తరగతి మెమోలను ఆన్‌లైన్‌లో పొందుపరింది.

అంతకు ముందు ఉన్న మెమోలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్యూఆర్‌ కోడ్‌ ను మెమోలపై ముద్రించడం వలన నకిలీ మెమోలను అరికట్టవచ్చని ప్రభుత్వ విద్యవిధానం భావిస్తుంది. అందువల్లనే ఇప్పటి నుంచి ముద్రించే మెమోలపై క్యూఆర్‌ కోడ్‌ను అమలు చేస్తున్నారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేస్తే విద్యార్థికి సంబందించిన అన్ని వివరాలు తెలుస్తాయని విద్యాశాఖ తెలుపుతుంది. నకిలీ మెమోపై క్యూఆర్‌ కోడ్‌ ఉండదని, ఒకవేళ ఏదైనా ముద్రించినా ఆ వివరాలు రావని అధికారులు చెబుతున్నారు. దాంతో నకిలీ మొమోలను నిరోధించవచ్చని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories