logo

ఈసెట్‌-2019 ప్రవేశ పరీక్షకు 5న నోటిఫికేషన్..

ఈసెట్‌-2019 ప్రవేశ పరీక్షకు 5న నోటిఫికేషన్..
Highlights

పాలిటెక్నీక్ చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ...

పాలిటెక్నీక్ చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈసెట్‌-2019 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ ఈనెల 5న వెలువడనుంది. ఈనెల 6నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. మే 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. కాగా ఎస్టీ, ఎస్టీ విద్యార్థులు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాలి. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్‌ 8 వరకు, రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 15 వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 22 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 29 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పాపిరెడ్డి తెలిపారు.

అలాగే మే 4 నుంచి 9 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. గతంలో లాగే ఈ ఏడాది కూడా ఈసెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం తెలంగాణతో పాటు ఏపీలోని కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పాపిరెడ్డి స్పష్టం చేశారు.


లైవ్ టీవి


Share it
Top