మీ మాటలు మాకెంతో సహకరిస్తాయి : చిరంజీవి ట్వీట్ పై తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి

మీ మాటలు మాకెంతో సహకరిస్తాయి : చిరంజీవి ట్వీట్ పై తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి
x
Highlights

లాక్ డౌన్ సమయంలో పోలీసుల కృషిని ప్ర‌శంసిస్తూ మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశారు. 'రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుల...

లాక్ డౌన్ సమయంలో పోలీసుల కృషిని ప్ర‌శంసిస్తూ మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశారు. 'రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్ లో చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్ డౌన్ సక్సెస్ అయింది. పోలీసుల పనితీరు వల్ల లాక్‌డౌన్‌ విజయవంతంగా జరుగుతోంది. అలా జరగడం వల్లే ఈ కరోనా వ్యాప్తి చాలా వరకూ అదుపులోకి వచ్చింది. ఈ మహమ్మారిని అంతమొందించడంలో సామాన్య జనం పోలీసులకు సహకారం అందించాలని నేను ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాను. పోలీసులు అందిస్తున్న సేవలకు ఓ పోలీసు బిడ్డగా చేతులెత్తి సెల్యూట్‌ చేస్తున్నాను. జైహింద్‌.' అని చిరంజీవి పేర్కొన్నారు.

చిరంజీవి పోస్ట్‌కు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మీరు మ‌మ్మ‌ల్నే కాదు, అంద‌రికి స్పూర్తిగా ఉంటారు. మిమ్మ‌ల్ని ఆద‌ర్శంగా తీసుకునే ఎంతో మందిని మీ మాట‌ల‌తో చైతన్యవంతులని చేశారు. పోలీస్ కుటుంబం నుండి వ‌చ్చిన మీరు చెప్పిన మాట‌లు కోవిడ్ 19కి వ్యతిరేకంగా మేం చేసే యుద్ధంలో మాకెంతో సాయ‌ప‌డ‌తాయి. మీ లాంటి హీరోలు పిలుపువల్ల చాలా మంది కరోనా పై పోరాటంలో ప్రజలు కలిసి వస్తారని పేర్కొన్నారు. ఒక పోలీసు ఫ్యామిలీ మెంబర్‌గా మీకు పోలీసులు బాధ్యతలు ఎలా ఉంటాయో తెలిపినందుకు కృతజ్ఞతలు అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories