సీఏఏ రాజ్యాంగ విరుద్ధం: ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు

సీఏఏ రాజ్యాంగ విరుద్ధం: ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు
x
Highlights

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. దీనికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. దీనికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేరళ, పంజాబ్‌ రాష్ట్రాలు శాసనసభ ద్వారా సీఏఏను వ్యతిరేకిస్తునట్లు తీర్మానించాయన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ ద్వంద విధానాలను మైనార్టీలు గమనించాలన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ అనేక సార్లు గతంలో మద్దతిచ్చిందని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మైనార్టీలు ఓడించాలని, ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులు, దళితులు, ఉద్యోగులు.. మున్సిపల్‌ ఎన్నికలను ఆయుధంగా మలచుకోవాలన్నారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యారని ఉత్తమ్ మరోసారి విమర్శించారు. ఎంపీ నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామన్నారు. మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories