వరి, మొక్కజొన్న విత్తనాలు అమ్మవద్దంటున్న కలెక్టర్లపై కోర్టుకెళ్తాం: ఉత్తమ్‌

వరి, మొక్కజొన్న విత్తనాలు అమ్మవద్దంటున్న కలెక్టర్లపై కోర్టుకెళ్తాం: ఉత్తమ్‌
x
Uttam Kumar Reddy
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని నిర్ణయించింది.

తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి ఇతర రాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. నాలుగు కమిటీలను ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, ఉస్మానియా భూములు, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసారు. అంతే కాక జూన్‌ 2వ తేదీన కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద, జూన్‌ 6వ తేదీన గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద కృష్ణా, గోదావరి నదులపై పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న అంశంపై చర్చించిన టీపీసీసీ నేతలు ఆదివారం ఉస్మానియాకు వెళ్లాలని నిర్ణయించారు.

పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, లక్ష్మీదేవిపల్లి పంపుహౌస్‌ దగ్గర కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ప్రాజెక్టుల దగ్గర ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లూరు జలాశయం దగ్గర మాజీ మంత్రి నాగం, కరివేన ప్రాజెక్టు దగ్గర మాజీ మంత్రి చిన్నారెడ్డి, సంపత్‌కుమార్‌ ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా కృష్ణానదిపై ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీస్తూ దీక్షలు చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories