Top
logo

ఆ భూములు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది.. జోక్యం చేసుకోండి

ఆ భూములు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది.. జోక్యం చేసుకోండి
X
Highlights

తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. తెలంగాణలో యూనివర్సిటీలను ప్రభుత్వమే...

తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. తెలంగాణలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వర్సిటీల భూములను నిర్వీర్యం చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా యూనివర్సిటీలను ప్రైవేటు పరం చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వర్సిటీలు లేకుంటే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను రక్షించాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఓయూ భూముల ఆక్రమణలపై గవర్నర్‌ తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. కేంద్ర సర్వే డిపార్ట్‌మెంట్‌తో సర్వే చేయించాలని కోరామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతో ఓయూ భూములు కబ్జా జరుగుతుందని ఆరోపించారు.

Web TitleTelangana Congress leaders meet Governor Tamilisai on Osmania University land encroachment
Next Story