టీ కాంగ్రెస్‌లో లుకలుకలు.. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా..?

టీ కాంగ్రెస్‌లో లుకలుకలు.. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా..?
x
Highlights

తెలంగాణలో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటంపై క్యాడర్‌లో నైరాశ్యంలో నెలకొంది. సీఎల్పీ...

తెలంగాణలో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటంపై క్యాడర్‌లో నైరాశ్యంలో నెలకొంది. సీఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనం కావడం కాంగ్రెస్‌ను కోలుకోని దెబ్బతీసింది. తాజాగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. పార్టీ మారుతున్నట్లు ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ బాధ్యుడు కుంతియా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఇవాళ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అవుతోంది. పరిషత్ ఎన్నికల్లో గెలిచాక పార్టీ మారిన వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సమావేశంలో చర్చించనున్నారు. రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పరిణామాలు ఎలాం ఉంటాయన్న దానిపై సమాలోచనలు జరుపుతారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణా కమిటీ చర్చించనుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? లేదా పార్టీ మారిన తర్వాత అనర్హత పిటిషన్ వేయాలా అన్న దానిపై టీపీసీసీ తర్జనభర్జన పడుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories