రేపు సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణాలకు భూమిపూజ

రేపు సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణాలకు భూమిపూజ
x
Highlights

తెలంగాణలో కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. రేపు మధ్యాహ్నం 12గంటలకు ఈ రెండు భవనాల నిర్మాణాలకు భూమి పూజ...

తెలంగాణలో కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. రేపు మధ్యాహ్నం 12గంటలకు ఈ రెండు భవనాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఎర్రమంజిల్‌లోని నిజాం ప్యాలెస్ వద్ద కొత్త అసెంబ్లీ, మండలి నిర్మాణం జరగబోతోంది. 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో ప్యాలెస్‌ను కూల్చేసి కొత్త హంగులతో అసెంబ్లీ భవనాలు నిర్మాణం కాబోతున్నాయి. దాదాపు 100 కోట్ల వ్యయంతో కొత్త అసెంబ్లీని నిర్మించాలని సీఎం కేసీర్ భావిస్తున్నారు.

నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపనకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ నిర్వహించనున్నారు. ఇప్పుడున్న ప్రాంగణంలోనే సచివాలయం, ఎర్రమంజిల్‌లో అసెంబ్లీకి నూతన భవనాలను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఉదయం సీఎం కేసీఆర్ ముందుగా సచివాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. ఇందుకోసం సచివాలయంలో ఈశాన్యంలో డీ బ్లాక్ వెనుకవైపు ఉన్న ఉద్యానవనంలో ఏర్పాట్లుచేస్తున్నారు. అనంతరం ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవన నిర్మాణపనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు కేసీఆర్.

నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. పక్కావాస్తుతోపాటు అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలు, సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మాణం జరుగనున్నది. ఇందుకోసం సమావేశహాళ్లు, కలెక్టర్ల సమావేశం కోసం కాన్ఫరెన్స్‌హాల్ నిర్మించనున్నారు. అలాగే విశాలమైన పార్కింగ్ ఏర్పాటుకూడా చేయనున్నారు. పూర్తి పర్యావరణ హితంగా సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, నిజాం వారసులు మాత్రం దేశ సంపదగా ఉన్న ప్యాలెస్‌ను కూల్చొద్దని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం పాత భవనాలను కూల్చేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో ప్యాలెస్‌ను కూల్చేని కొత్త నిర్మాణాలు జరపాలని భావిస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే భవనాలు నిర్మించేందుకు లక్ష్యంగా సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ మోడల్‌లోనే కొత్త అసెంబ్లీగా ఉంటుందని, లోపల కొత్త హంగులు సంతరించుకుంటుందని తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories