CM KCR: నేడు సూర్యపేట్ కు సీఎం కేసీఆర్...

CM KCR: నేడు సూర్యపేట్ కు సీఎం కేసీఆర్...
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సూర్యాపేటకు వెళ్లనున్నారు. దేశ రక్షణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యుల్ని సీఎం...

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సూర్యాపేటకు వెళ్లనున్నారు. దేశ రక్షణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యుల్ని సీఎం పరామర్శించనున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారాన్ని చెక్కు రూపంలో, అదే విధంగా హైదరాబాద్‌లో 800 చ.గజాల నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్‌ను కేసీఆర్ ఇవాళ సంతోష్ భార్య సంతోషికి ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే మొన్న మంత్రి జగదీశ్ రెడ్డి ఆయన సతీమని సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్నల్ కుటుంబానికి ఇది ప్రభుత్వ సాయం కాదని, దేశ కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్‌కు ఇస్తున్నగౌరవమని తెలిపారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి సీఎం అందజేస్తానన్న సాయాన్ని తీసుకోవడానికి వారు అంగీకరించారని స్పష్టం చేసారు.

ఇక ఇదే ఘర్షణలో తెలంగాణ జవాన్ కల్నల్ సహా మరో 19 మంది మరణించారని వారి కుటుంబ సభ్యులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ప్రకటించిందని తెలిపారు. ఈ నగదును రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సిఎం వెల్లడించారు. సంతోష్ బాబు సేవలకు గుర్తుగా, యువతకు స్పూర్తిగా ఉండాలని కేసీఅర్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్ లో కుటుంబ అవసరాల రీత్యా 5కోట్ల నగదు, ఇంటి జాగా ఇవ్వాలని కేసీఆర్ ప్రకటించారన్నారు. కొడుకు పోయిన బాధ కంటే దేశం కోసం చనిపోయాడని వాళ్ళు చెప్పడం వారి గొప్పదనానికి నిదర్శనం అని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే కేసీఆర్ రాకపైన సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము అని మంత్రి తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories