నియంత్రిత పంటల సాగుపై 21న సీఎం కేసీఆర్‌ సమీక్ష

నియంత్రిత పంటల సాగుపై 21న సీఎం కేసీఆర్‌ సమీక్ష
x
KCR (File Photo)
Highlights

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈ నెల 21వ తేదీన సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై విస్తృత స్థాయి సమావేశం...

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈ నెల 21వ తేదీన సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై అధికారులంతా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు, రేపు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వ్యవసాయ వర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏయే జిల్లాలలో ఏయే పంటలు వేయాలి, ఎంత మొత్తంలో వేయాలి అతే అంశంపై చర్చించనున్నారు. వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ, ఎంత వేయాలి? అనే అంశాలను ఖరారు చేయనున్నారు. అధికారులందరూ జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను రూపొందించనున్నారు.

21వ తేదీన జరగబోయే సమావేశంలో సీఎం ఆధ్వర్యంలో ఈ పంటల మ్యాప్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ప్రగతి భవన్ లో సీఎం నిర్వహించే సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు హాజరు కానున్నారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే వివరాల్లోకెళ్తే పసుపు 1.20 లక్షల ఎకరాల్లో, మిర్చి 2 లక్షల ఎకరాల్లో, వరి 40 లక్షల ఎకరాల్లో(తెలంగాణ సోనా 10 లక్షల ఎకరాలు), 70 లక్షల ఎకరాల్లో పత్తి, కంది 15 లక్షల ఎకరాల్లో, కూరగాయలు 2 లక్షల ఎకరాల్లో, సోయాబీన్‌ 3 లక్షల ఎకరాల్లో వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. మక్క పంటను యాసంగిలో మాత్రమే వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories