ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరు : కేసీఆర్

ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరు : కేసీఆర్
x
KCR
Highlights

కరోనాని అరికట్టడంలో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ తెలివిగా వ్యవహరించిందని అన్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ .

కరోనాని అరికట్టడంలో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ తెలివిగా వ్యవహరించిందని అన్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణాలో 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, అందులో 11 మంది కోలుకుంటున్నట్లుగా, మరో 58 మంది పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. పరిస్థితులను బట్టి వారీగా డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పరిధిలో 25937 మంది పర్యవేక్షణలో ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇక లాక్ డౌన్ పై ప్రభుత్వం ఇచ్చిన సూచనలను రాష్ట్రంలోనూ అందరూ సహకరిస్తున్నారని, ఇదే స్పూర్తిని చిరవివరకు కొనసాగించాలని కేసీఆర్‌ కోరారు. కరోనాని అరికట్టేందుకు కేంద్రం కూడా విమానాశ్రయాలు, పోర్టులన్నీ మూసివేసిందని అందువల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువని సీఎం అన్నారు. ఇక రాష్ట్రంలోనూ కొత్త కేసులు నమోదు కాకపోతే ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరని, అప్పుడు కరోనా ఫ్రీగా తెలంగాణా అవుతుందని కేసీఆర్ వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories