ప్రధాని మోడీ పైనే జోకులా... వారిపై మండిపడ్డ కేసీఆర్

ప్రధాని మోడీ పైనే జోకులా... వారిపై మండిపడ్డ కేసీఆర్
x
KCR (File Photo)
Highlights

ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు వేయడం ఎం సంస్కారం ఎం పద్ధతి అని కేసీఆర్ మండిపడ్డారు.

కరోనావైరస్ ని ఎదురుకోవడానికి సంఘీభావంగా ఏప్రిల్ 05 న (ఆదివారం) రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే దీపం వెలిగించాలని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై జోకులు, సెటైర్లు వేసిన వారిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో నిర్వహిస్తున్న లాక్ డైన్ పై తెలంగాణలో ఉన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం పలు అంశాలపైన కేసీఆర్ మాట్లాడారు.

ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు వేయడం ఎం సంస్కారం ఎం పద్ధతి అని కేసీఆర్ మండిపడ్డారు. దీపం వెలిగించడాన్ని సంఘీభావ సంకేతం కోసం అని, ఎవ్వరం ఒంటరి కాదు.. జాతి ఐక్యతను, మనోధైర్యాన్ని ప్రతిబింబించే చర్యలు ఇవి అని కేసీఆర్ వెల్లడించారు. తానూ తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సార్లు ఇలాంటివి కోరానని, కొన్ని వేల గంటలు కొట్టాం ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు . ప్రధానమంత్రి అంటే వ్యక్తి కాదని, ఓ వ్యవస్థ అని అలాంటి వ్యవస్థని ప్రకటనను హేళన మంచిది కాదని కేసీఆర్ హితవు పలికారు.

ఇక దేశంలో లాక్ డౌన్ ని మరో వారం లేదా రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరినట్లుగా కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం అలాంటి గత్యంతరం తప్ప మరేమీ లేదని కేసీఆర్ అన్నారు. కేంద్రం కూడా అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తునట్టుగా తెలిపారు. ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ రాష్ట్రంలో లాక్ డౌన్ ని కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇక కరోనా పై తప్పుడు వార్తలు రాసే వారిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్కా కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనలకి గురి అవుతుంటే తప్పుడు వార్తలు రాయడం సరికాదని అన్నారు. ఇలా తప్పుడు వార్తలు రాసే వారికీ కరోనా రావాలని వారికి రోగం వస్తే కరోనా అంటే ఏంటో తెలుస్తుందని అన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories