యదాద్రి పనులపై కేసీఆర్ అసంతృప్తి ...

యదాద్రి పనులపై కేసీఆర్ అసంతృప్తి ...
x
Highlights

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యరాజధానిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. ఆలయ నిర్మాణ...

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యరాజధానిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాగం. ఆలయ పనులపై అధికారులను నిలదీశారు. ఆలయ నిర్మాణానికి 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. పనులు వేగవంతంచేశాలని ఆదేశించారు.

హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ తర్వాత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ కు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు. మంత్రులు, అధికారులతో కలిసి ఆలయం చుట్టూ తిరుగుతూ నిర్మాణ పనులను పరిశీలించారు. కొండచుట్టూ గిరి ప్రదర్శన కోసం నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించారు. ప్రసాదాల, క్యూ కాంప్లెక్స్ భవనాలను చూశారు.

యాదాద్రి పనుల పురోగతిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి కొండపై హరిత హోటల్లో అధికారులతో సమీక్షించిన కేసీఆర్. ప్రధాన ఆలయం పనులు మినహా ఇతర పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పట్లోగా పనులు పూర్తి చేస్తారంటూ ప్రశ్నించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి 473 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories