నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఓ కీలక చట్టానికి..

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఓ కీలక చట్టానికి..
x
కేసీఆర్
Highlights

తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ సాయంత్రం 5గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. కొత్త రెవెన్యూ చట్టంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇరిగేషన్ అంశాలపైనే...

తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ సాయంత్రం 5గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. కొత్త రెవెన్యూ చట్టంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇరిగేషన్ అంశాలపైనే కేబినెట్ చర్చించనుంది. ఇక తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్రం తీరుపై చర్చించే అవకాశం ఉంది.

తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు సహా పలు అంశాలు చర్చకు రానున్నాయి.

మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆశించిన స్థాయిలో రావడం లేదనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సీఎం కేసీఆర్. దీనిపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి ? రావాల్సిన నిధులు ఎన్ని ? అనే అంశంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం శాఖలవారీగా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి వివరాలను ప్రజల ముందుంచాలని భావిస్తోంది.

భేటీలో జీఏడీ, ఇరిగేషన్‌, మునిసిపల్‌, ఇండస్ట్రీస్‌, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు నోట్‌ తయారు చేసి కేబినెట్ ముందు ఉంచనున్నారు. స్టేట్ ఫైనాన్స్‌ స్టేటస్‌పై మంత్రులకు ఒక బుక్‌లెట్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి. 2019-20 బడ్జెట్‌లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులను కేబినెట్ పునసమీక్ష చేయనుంది. ఇక ఓ కీలక చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం జారీ చేయనున్న ఆర్డినెన్సుకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories