తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం.. లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఇస్తారా..?

తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం.. లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఇస్తారా..?
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఈ రోజు రాష్ట్ర మంత్రిమండలి ప్రత్యేక సమావేశం ప్రారంభమయింది. తెలంగాణలో లాక్ డౌన్ ఇంకెన్ని...

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఈ రోజు రాష్ట్ర మంత్రిమండలి ప్రత్యేక సమావేశం ప్రారంభమయింది. తెలంగాణలో లాక్ డౌన్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది? గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఉంటాయా..? వైన్ షాపులు తెరిచి.. మందుబాబులకు గుడ్ న్యూస్ అందిస్తారా..? కేంద్రం మార్గదర్శకాలు.. రాష్ట్రంలో అమలు చేస్తారా..? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఇవాళ సమాధానాలు రాబోతున్నాయి. కరోనా వ్యాప్తి నిరోధానికి చేపట్టిన లాక్ డౌన్ పై తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

రాష్ట్రంలో లాక్ డౌన్ ఈ నెల 7 వరకు కొనసాగనుంది. కానీ ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వెళ్ళాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని తాజా పరిస్థితులను సీఎస్ సోమేశ్ కుమార్ వివరాలు సేకరిస్తున్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. ఇటు మే 3 తర్వాత కేంద్రం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ నుంచి కొంత సడలింపులు ఇచ్చింది. దీంతో కేబినేట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చే లక్ష్యంతో.. కేంద్రానికి కేసీఆర్ రకరకాల సూచనలు చేశారు. వాటిపై కేంద్రం నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం మార్గదర్శకాలు అమలు చేయడంతో ముందుకు వెళ్లాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక వైరస్ వ్యాప్తి లేని ప్రాంతాల్లో పరిమితమైన ఆంక్షలతో దాదాపు మామూలు స్థాయి పనులు చేసుకోవచ్చని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో ఆంక్షలను సడలించే యోచన చేస్తోంది. తక్షణం ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే మద్యం, రోడ్ టాక్స్, పెట్రో అమ్మకాలను అనుమతించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్ లోనూ, మరో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లోనూ ఉన్నందున ఆయా జిల్లాల్లో మామూలు కార్యకలాపాలు జరిగేలా మే 7వ తేదీ నుంచి ఆంక్షలను సడలించడమే మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories