కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ

కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ
x
Highlights

తెలంగాణ కేబినేట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. తమకు అవకాశం దక్కుతుందా లేదా అనే విషయంపై ఆశావాహాల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు బెర్తులు ఖాయమని...

తెలంగాణ కేబినేట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. తమకు అవకాశం దక్కుతుందా లేదా అనే విషయంపై ఆశావాహాల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు బెర్తులు ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈ సారి కేబినెట్ విస్తరణలో ఇద్దరు లేదా ముగ్గురికే చోటు కల్పిస్తారా..? లేదా పూర్తి స్థాయిలో విస్తరణ జరుగుతుందా అనే అంశంపై చర్చ జరుగుతోంది.

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల ప్రారంభం కానున్నాయి. మంత్రి పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్న అశావాహులు కొంతమంది తమ సామాజిక నేపథ్యం, జిల్లాల ప్రాతినిధ్యం దృష్టా ఈ సారి కేబినెట్‌లో బెర్త్ ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు.

ఇక ప్రభుత్వం కూడా పాలనపై మరింత దృష్టిపెట్టాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, మంత్రులతో కొత్త చట్టాలు, వాటి అమలుపై రూట్ మ్యాప్ ప్రకటించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా బడ్జెట్‌ అంశంపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ ను నియమించారు. త్వరలో 60 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాల్లో వినూత్న పాలనను ప్రజలకు అందించి ఫలితాలు తీసుకురావాలని భావిస్తున్న అధినేత అంతకుముందే కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేస్తారని చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు ఖాళీలు ఉండగా, కూడికలు తీసివేతల్లో ఎవరు ఉంటారో, కొత్తగా ఎవరొస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కేబినెట్‌లో హరీష్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేగా కాంతారావు, జోగు రామన్న‌, బాజిరెడ్డి గోవర్దన్‌, దానం నాగేందర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కేటీఆర్, హరీష్ రావు కు మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో అందరు విస్తుపోయారు. అయితే పార్టీ అవసరాల దృష్ట్యా మంత్రి వర్గంలోకి కేటీఆర్ ను తీసుకోవాలని అధికార పార్టీ నుంచే కాక మిత్ర పక్షాల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల దృష్యా కేటీఆర్ ను తీసుకోవాలని ఏకంగా సీఎం కేసీఆర్ కే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు వచ్చాయి. ఇక హరీష్ రావును సైతం తీసుకునే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

అయితే ఆరు మంత్రి పదవులు మాత్రమే ఖాళీగా ఉండటంతో ఇద్దరు, లేదా ముగ్గురినే కేబినెట్‌లోకి తీసుకుంటారా ..? లేదా పూర్తిస్థాయిలో కేబినెట్ విస్తరణ చేసి పాలనపై ఫోకస్ పెడతారా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories