నేడు గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ.. 10 మందికి క్యాబినెట్ లో చోటు

నేడు గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ.. 10 మందికి క్యాబినెట్ లో చోటు
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. మంత్రి వర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో మంత్రివర్గ...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. మంత్రి వర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తో చర్చించేందుకు నేడు(శుక్రవారం) అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా మొదటి విడతలో 10 మందికి క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అందులో దాదాపుగా కొత్త ముఖాలే వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రివర్గంలో చోటుకోసం ఎక్కువమందే ఆశిస్తున్నారు.. ఇందులో

రంగారెడ్డి: అరికెపూడి గాంధీ , మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కె.పి.వివేకానంద్‌గౌడ్,

హైదరాబాద్‌: దానం నాగేందర్‌ , తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావుగౌడ్

మహబూబ్‌నగర్‌: సి.లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పి.నరేందర్‌రెడ్డి

ఆదిలాబాద్‌: జోగు రామన్న, అజ్మీరా రేఖానాయక్, కోనేరు కోనప్ప

నిజామాబాద్‌: వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆకుల లలిత , బాజిరెడ్డి గోవర్ధన్

కరీంనగర్‌: ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌

వరంగల్‌: ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి,డి.ఎస్‌.రెడ్యానాయక్‌ , అరూరి రమేశ్

ఖమ్మం: పువ్వాడ అజయ్‌కుమార్‌ , పల్లా రాజేశ్వర్‌రెడ్డి

మెదక్‌: తన్నీరు హరీశ్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డి , సోలిపేట రామలింగారెడ్డి

నల్లగొండ: జి.జగదీశ్‌రెడ్డి, ఆర్‌.రవీంద్రనాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, గొంగిడి సునీత తదితరులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories