వివరణ ఇవ్వక పోతే కళాశాలలు మూసివేస్తాం: ఇంటర్‌ బోర్డు

వివరణ ఇవ్వక పోతే కళాశాలలు మూసివేస్తాం: ఇంటర్‌ బోర్డు
x
Highlights

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో గుర్తింపు లేని 79 ఇంటర్ కాళాశాలలకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో గుర్తింపు లేని 79 ఇంటర్ కాళాశాలలకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రైవేటు జూనియర్‌ కళాశలల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావశంలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్‌ సభ్యులు, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు గుర్తింపులేని 79 ప్రైవేటు కళాశాలలకు నోటీసులు ఇచ్చామని వారు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరణ మూడు రోజుల్లో ఇవ్వాలని తెలిపారు. ఈ నెల 25 తేదీ లోపు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని, కాలేజీ యాజమాన్యాలు దానికి సహకరించాలని యాజమాన్యాలను కోరారు.

కాలేజీల యాజమాన్యాల నుంచి స్పందన రాకపోతే కళాశాలలు మూసివేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ పేర్కొన్నారు. కొన్ని కాలేజీలు ఒక చోట అనుమతి తీసుకుని మరోచోట నడుపుతున్నారని తెలిపారు. మరి కొన్ని కళాశాలలకు అగ్నిమాపక అనుమతి లేదని వారు స్పష్టం చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories