సీఎం కేసీఆర్‌కు లక్ష్మణ్ సవాల్..కారణం చెబితే అధ్యక్ష పదవికి రాజీనామా !

సీఎం కేసీఆర్‌కు లక్ష్మణ్ సవాల్..కారణం చెబితే అధ్యక్ష పదవికి రాజీనామా !
x
సీఎం కేసీఆర్‌కు లక్ష్మణ్ సవాల్
Highlights

పౌరసత్వం బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు. సీఏఏ చట్టానికి...

పౌరసత్వం బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు. సీఏఏ చట్టానికి మద్దతుగా నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన ఆయన బిల్లు వ్యతిరేకానికి సహేతుక కారణం చెబితే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే కేసీఆర్‌కు పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. భద్రాచలంలో రామునికి తలంబ్రాలు ఇ‍వ్వలేని నువ్వు హిందువు ఎలా అవుతావని కేసీఆర్‌ను నిలదీశారు.

ఇటు ఎంపీ అర్వింద్‌ అయితే ఎంఐఎం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ''కేసీఆర్‌ ముస్లింలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఒవైసీ గడ్డం పీకీ కేసీఆర్‌కు పెడతా. ఏం పీకుదామని నిజామాబాద్‌కు వచ్చారో ఓవైసీ చెప్పాలి. కూతురు ఓడిపోయిందన్న బాధలో అసద్‌ను కేసీఆర్‌ మాటిమాటికీ నిజామాబాద్‌ పంపుతున్నారు. కేటీఆర్ అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ బలోపేతం అవుతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ 95 శాతం ఓట్లు వస్తాయి'' అని వ్యాఖ్యానించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories