రాచరిక పాలనకు సీఎం కేసీఆర్ తెర లేపారు : లక్ష్మణ్

రాచరిక పాలనకు సీఎం కేసీఆర్ తెర లేపారు : లక్ష్మణ్
x
Bjp Leader Laxman (File Photo)
Highlights

తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సీఎం కేసీఆర్‌కు మంగళవారం బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సీఎం కేసీఆర్‌కు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. అనంతరం ఆయన జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో ఎదురవుతున్న పరిస్థితులపై లేఖలో ఆయన ప్రస్తావించారు. లాక్ డౌన్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం సరైన రీతిలో కరోనా పరీక్షలు, చికిత్స చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని లక్ష్మణ్ లేఖలో వివరించారు. తెలంగాణలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాచరిక పాలనకు తెర లేపారని ఆయన విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు చనిపోయారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే వాటిని టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో చూస్తోందని అన్నారు.

గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుల శవాల ఆచూకీ గల్లంతుకావడం వంటి గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్ మాదిరిగా టిమ్స్‌ను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పారని, ప్రస్తుతం దాని నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఇక పోతే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కలిసి ఉన్నతమైన సిద్ధాంతం కోసం కశ్మీర్‌ను దేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తి స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లాలని భావించిన మోదీకి కరోనా మహమ్మారి అడ్డుతగులుతోందని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories