Top
logo

కేసీఆర్ ఉద్యోగులను మోసం చేస్తున్నారు: లక్ష్మణ్

కేసీఆర్ ఉద్యోగులను  మోసం చేస్తున్నారు: లక్ష్మణ్
Highlights

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పెరిగిపోతుందని, నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ టీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పెరిగిపోతుందని, నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ టీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కల్వకుంట్ల కుటుంబీకులకు పదవులు లభిస్తున్నాయే తప్ప, రాష్ట్రంలోని యువతకు మాత్రం ఉద్యోగాలు లభించడంలేదని అన్నారు. ఆరేళ్లనుంచి ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా గ్రూప్-1 నోటిఫికేషన్ ను విడుదల చేయలేదని ఆయన అన్నారు.

దీంతో ఎంతో మంది యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేసారు. వారికి కనీసం ఇస్తామన్న నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వకుండా పక్కనబెట్టేశారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి వంతపాడుతూ ఉద్యోగులను వంచిస్తున్నారని ఆరోపించారు.

ఎలక్షన్లు వస్తున్నప్పుడే సీఎం కేసీఆర్ కు అన్ని వర్గాల ప్రజలు గుర్తొస్తారని ఆ తరువాత ఎవరూ గుర్తు రారని ముఖ్యంగా నిరుద్యోగులు గుర్తు రారని అన్నారు. ఉద్యోగులను కూడా ఆయన మోసం చేశారని, ప్రతినెల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి కైనా నిరుద్యోగులను గుర్తించి వెంటనే నోటిఫికేషన్ ను విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలని అన్నారు.

Web TitleTelangana BJP Chief Lakshman Slams Kalvakuntla Family
Next Story


లైవ్ టీవి