ఈనెల 9 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 9 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
x
Highlights

ఈనెల 9 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఇరు సభలు సమావేశం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపు పది రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఏఏ అంశాలు చర్చించాలనే విషయంపై మాత్రం బీఏసీలో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ నెల 9 తేదీలో శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories