అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం కసరత్తు

అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం కసరత్తు
x
Highlights

తెలంగాణ బడ్జెట్ సమావేశాల నిర్వాహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 4,9,14 తేదీల్లో ఏదో ఒక తేది నుండి సమావేశాలు ప్రారంభించాలని యోచిస్తుంది.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల నిర్వాహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 4,9,14 తేదీల్లో ఏదో ఒక తేది నుండి సమావేశాలు ప్రారంభించాలని యోచిస్తుంది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఈ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 4, 9, 14 తేదీల్లో ఏదో ఒక తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రగతి భవన్ లో బడ్జెట్ పై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల తేదీపై చర్చించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రాష్ర్ట మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులను సమావేశపరిచి ఆర్ధిక పరిస్థితి వివరించాలని.. ఆర్ధిక క్రమశిక్షణ పాటించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమర్చి చెప్పాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

సెప్టెంబర్ 24 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే స్పీకర్ల, సెక్రటరీల సమావేశం ఉన్నందున అంతకు ముందే అసెంబ్లీ సమావేశాలు జరుపాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసినందున ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టడం.. తదుపరి రోజు సెలవు ఇవ్వడం.. తర్వాత రోజుల్లో చర్చ..అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదించనున్నారు. అసెంబ్లీ సమావేశ పరచడానికి ముందే మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే విషయం త్వరలో నిర్ణయించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories