Top
logo

ఈ నెల 8న బడ్జెట్‌.. 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 8న బడ్జెట్‌.. 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలుఈ నెల 8న బడ్జెట్‌.. 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు
Highlights

ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ...

ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతో పాటు శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు.

రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఈనెల 8న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 9, 10, 15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు, అక్బరుద్దీన్‌ ఓవైసీ, భట్టి విక్రమార్క హాజరయ్యారు.

Web TitleTelangana Assembly Budget session 2020 will continue till 20th March
Next Story