చేతికొచ్చిన తెలంగాణ యాపిల్‌..సంతోషంలో రైతు

చేతికొచ్చిన తెలంగాణ యాపిల్‌..సంతోషంలో రైతు
x
Apple Crop in Telangana
Highlights

చల్లని వాతావరణంలో మాత్రమే పండే ఆపిల్ ను ఇప్పుడు తెలంగణాలో కూడా సాగు చేసారు.

చల్లని వాతావరణంలో మాత్రమే పండే ఆపిల్ ను ఇప్పుడు తెలంగణాలో కూడా సాగు చేసారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సొంత గడ్డపై కాసిన ఫలాల రుచిని ఆస్వాదించే అవకాశం వచ్చేసింది. పూర్తి వివరాల్లోకెళ్తే కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు కేంద్రె బాలాజీ ఆపిల్ తోటను సాగు చేశాడు. రాజమండ్రిలోని ఓ నర్సరీ నుంచి బాలాజీ పది యాపిల్‌ మొక్కలు తీసుకొచ్చి నాటాడు. తన స్నేహితుడి సలహాతో, తనకున్న పరిజ్ఞానంతో తోటకు అనుకూలమైన వాతావరణం కల్పించి ఏపుగా పెంచాడు. ఆ యాపిల్ తోట దినదినాభివృద్ది చెంది యాపిల్‌ పండు పండింది.

నాలుగేండ్ల క్రితం ప్రయోగాత్మకంగా యాపిల్ మొక్కలు నాటగా సోమవారం మొదటి పంట చేతికొచ్చింది. యాపిల్ పండ్ల మొదటి పంట చేతికి రావడంతో బాలాజీ చెట్లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండ్లు కోయడం ప్రారంభించారు. ఆరు కిలోల యాపిల్ పండ్లను 50 చెట్లను నుంచి సేకరించారు. ఒక్కో పండు 150 నుంచి 200 గ్రాముల వరకు ఉన్నది. తన ప్రయోగం విజయవంతంగా ఫలించడంతో ఆ సంతోషాన్ని తన తల్లితో పంచుకున్నాడు. మొదట తెంపిన రెండు పండ్ల బుట్టలను తన తల్లి కేంద్రే లక్ష్మీబాయికి అందించి ఆశీర్వాదం తీసుకొన్నారు. బుధవారం రోజున మొదటి యాపిల్ పంటను రాష్ట్రానికే పెద్ద అయిన సీఎం కేసీఆర్ కు అందించేందుకు బాలాజీ సిద్ధమవుతున్నారు. ఈ పండ్లను సీఎం కేసీఆర్ కు బహూకరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు సదరు రైతు తెలిపారు.

ఈ పంటను విజయవంతంగా పండించడానికి యాపిల్‌ సాగుపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కూడా తమ వంతు ప్రోత్సాహం అందించారని రైతు తెలిపారు. 2014లో ఈ భూమిలో సాగుకు అనుకూలమైన హరిమ న్‌ రకానికి చెందిన 150 మొక్కలను ఇచ్చి సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా 2016లో వ్యవసాయశాఖ మరో 300 మొక్కలు ఇవ్వగా నాటాడు. మూడు సంవత్సరాలు కాసిన కాయలను కోయకుండా చెట్టుకు అలాగే వదిలేశాడు. ప్రస్తుతం అవి చేతికి వచ్చాయి. ఇవి ఎర్రగా కశ్మీర్‌ యాపిల్‌ను తలపిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories