సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కలకలం.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

X
Highlights
సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు గుండా రవీందర్ అనే వ్యక్తి హల్‌చల్ చేశాడు. దీంతో పంజాగుట్ట పోలీసులు అతన్ని...
Arun Chilukuri15 Nov 2019 8:27 AM GMT
సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు గుండా రవీందర్ అనే వ్యక్తి హల్‌చల్ చేశాడు. దీంతో పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పని చేశానని సీఎం కేసీఆర్‌కు మంచిర్యాల జిల్లాలో గుడికట్టి రోజు పూజలు నిర్వహిస్తున్నానని తెలిపాడు గుండా రవీందర్.
తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఉద్యమకారుడైన తనకు ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఎలాంటి సాయం అందడంలేదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి వచ్చానని తెలిపాడు గుండా రవీందర్.
Web TitleTelangana Activist Protest at Pragathi Bhavan
Next Story