సర్కారు బడుల్లో కొత్త నిబంధన..పది ఫేలయితే ఎవరి బాధ్యతో తెలుసా ?

సర్కారు బడుల్లో కొత్త నిబంధన..పది ఫేలయితే ఎవరి బాధ్యతో తెలుసా ?
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

హైదరాబాద్ నగరంలో పదోతరగతి చదివే పిల్లల తల్లిదండ్రులు వారి విషయంలో చింతించాల్సిన అవసరం లేదు.

హైదరాబాద్ నగరంలో పదోతరగతి చదివే పిల్లల తల్లిదండ్రులు వారి విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచే బాధ్యతను ప్రభుత్వం సర్కారు బడుల ఉపాధ్యాయుల మీద వేసింది. దీంతో ఎంకి చావు సుబ్బి పెళ్లికి వచ్చిందన్న చందంగా విద్యార్థుల పది ఫలితాలు ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షగా మారాయి.

అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండే హైదరాబాద్ నగరం పదో తరగతి ఫలితాల విషయంలో ప్రతి ఏడాది వెనుకడుగు వేస్తుంది. ఏ ఏడాదికి ఆ ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలెనే ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఏ సబ్జెక్టు పరీక్షల్లో ఫెయిలైతే.. ఆ సబ్జెక్టుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులదే బాధ్యత అంటూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయా సబ్జెక్టుల టీచర్ల నుంచి 'అండర్‌ టేకింగ్‌' లెటర్లు తీసుకుంటున్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత చూపించినప్పటికీ మరింత బాధ్యత తీసుకుని ఇప్పటికే పూర్తయిన పదో తరగతి పాఠ్యాంశాలను మరో సారి పున:శ్చరణ చేస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థులకు వీకెండ్ టెస్టులను కూడా పెడుతున్నారు. మెరుగైన ఫలితాలు సాధించడానికి ఎంతగానో కష్ట పడుతున్నారు. చదువుకునే విద్యార్థులతో పాటుగానే ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులపైనా ఒత్తిడి పెంచుతున్నారు.

ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 7200 మంది పిల్లలు సర్కారు బడుల్లో చదువుతున్నారు. అంతే కాకుండా రంగారెడ్డి జిల్లాల్లో 17 వేల మంది, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 10 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ రెండు జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లా ఉత్తీర్ణత శాతంలో వెనుకంజలో ఉందని చెప్పుకోవచ్చు. పిల్లల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే ఉద్దేశంతో కొత్త సిలబస్ ను రూపొందించింది. కానీ ఈ పాఠ్యాంశాలపై కొంత మంది ఉపాధ్యాయులు పట్టు సాధించలేక పిల్లలకు సరైన పద్ధతిలో బోధించలేక పోతున్నారు.

దీంతో పిల్లలు ఎక్కువగా మ్యాథ్స్, సైన్స్‌ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించడం లేదని అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది ఉత్తీర్ణతలో హైదరాబాద్‌ 31వ స్థానంలో నిలిచింది. ఇందుకు కోసమే వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణనను ఇవ్వాలని అధికారులు చెపుతున్నారు. ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాలని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories