నీటి సమస్య ఉందని విద్యార్థుల జట్టు కత్తిరింపు

నీటి సమస్య ఉందని విద్యార్థుల జట్టు కత్తిరింపు
x
Highlights

ఎక్కడైనా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటారు. కొందరైతే బోరు వేసుకుంటారు. మరికొందరైతే వర్షం నీటిని జాగ్రత్త చేసుకుని...

ఎక్కడైనా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటారు. కొందరైతే బోరు వేసుకుంటారు. మరికొందరైతే వర్షం నీటిని జాగ్రత్త చేసుకుని వినియోగించుకుంటారు. అయితే మెదక్ జిల్లాలో మాత్రం నీటి సమస్య ఉందని ఓ మినీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినుల జట్టు కత్తిరించింది.

మెదక్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల పాఠశాల. ఇక్కడ 1వ తరగతి నుంచి ఆరో తరగతి వరకు పాఠశాల అలాగే హాస్టల్ కూడా ఉంది. సుమారు 180 మంది విద్యార్థులు ఉంటారు. కొంత కాలంగా ఈ హాస్టల్‌లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. బోరు ఉన్న పనిచేయకపోవడంతో బయట నుంచి ట్యాంకర్లు తెప్పిస్తున్నారు. అయినా నీటి సమస్య తీరకపోవడంతో ప్రిన్సిపాల్‌కో ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. విద్యార్థుల జట్టు కత్తిరిస్తే తల స్నానానికి అయ్యే నీటి వంతు తగ్గుతుందని అనుకున్నారో ఏమే అంతే వెంటనే విద్యార్థినులకు కట్టింగ్ చేయించేశారు.

అయితే పిల్లలను చూసేందుకు హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులు వాళ్ల రూపును చూసి షాక్ అయ్యారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీరు లేక జట్టు కట్ చేసుకున్నామని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు హాస్టల్ నిర్వహకులతో వాగ్వాదానికి దిగారు. ఇది చినికి చినికి గాలి వానలా మరింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమపై దౌర్జన్యం చేశారని హాస్టల్ అధికారులు కేసు పెట్టారు. తాము విద్యార్థుల ఆరోగ్యం కోసమే జట్టు కట్ చేశామని నీటి కొరత కోసం కాదని ప్రన్సిపాల్, ఇతర అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం నీటి కొరత వల్లే తమ జట్టు కత్తిరించారని తమ హాస్టల్‌లో ఎప్పటి నుంచో వాటర్ ప్రొబ్లమ్ ఉందని అంటున్నారు. హాస్టల్‌లో ఉన్న నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు. విద్యార్థుల జట్టు తల్లిదండ్రులకు చెప్పకుండా కత్తిరించడం తప్పేనని అయితే నీటి సమస్య వల్ల మాత్రం అలా చేయలేదని హాస్టల్ ప్రిన్సిపల్ చెబుతున్నారు. తల్లిదండ్రులు మాత్రం వారి నిర్వాకంపై మండిపడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories