తెలంగాణ మున్సిపోల్స్ బరిలో టీడీపీ

తెలంగాణ మున్సిపోల్స్ బరిలో టీడీపీ
x
TTDP
Highlights

-టీటీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు -మున్సిపోల్స్‌ వ్యూహంపై మంతనాలు

తెలంగాణ మున్సిపల్ పోరులో సత్తా చాటేందుకు తెలుగుదేశం వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నిస్తోన్న చంద్రబాబు మున్సిపోల్స్‌ వ్యూహంపై టీటీడీపీ నేతలతో చర్చించారు. ఇక, పార్టీనే నమ్ముకుని టీటీడీలో కొనసాగుతోన్న పలువురు నేతలు... మున్సిపల్ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో, ఆశావహులతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సందడిగా మారింది.

పోగొట్టుకున్న చోటే తిరిగి సాధించుకోవాలన్న సిద్ధాంతాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయాలని టీ-టీడీపీ భావిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలుగుదేశం వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికీ తెలంగాణ అంతటా టీడీపీకి క్యాడర్ ఉందని అధినాయకత్వం భావిస్తోంది. అందుకే, టీటీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబుమున్సిపోల్స్‌ వ్యూహంపై చర్చించారు. ఇక, టీడీపీనే నమ్ముకుని పార్టీలో కొనసాగుతోన్న నేతలు మున్సిపల్ బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆశావహులంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు క్యూకడుతున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, ఖమ్మం జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న టీడీపీ తన ఉనికిని కాపాడుకునేందుకు పాట్లు పడుతోంది. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తెలంగాణ తమ్ముళ్లకు వారంలో ఒకరోజు సమయం కేటాయిస్తూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories