Top
logo

రేపు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న తమిళి సై

రేపు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న తమిళి సై
Highlights

తెలంగాణ రెండో గవర్నర్‌గా తమిళి సై సౌందర్‌ రాజన్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారు. ఉదయం 11 గంటలకు హైకోర్టు...

తెలంగాణ రెండో గవర్నర్‌గా తమిళి సై సౌందర్‌ రాజన్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారు. ఉదయం 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్ తమిళి సై చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర మంత్రులు హాజరుకానున్నారు.

సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న తమిళిసై కాసేపట్లో కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆదివారం తెలంగాణ గవర్నర్‌గా ఆమె చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు. రాజ్‌భవన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై వృత్తిరిత్యా వైద్యురాలు. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో 1961 జూన్‌ 2 న ఆమె జన్మించారు. ఆమె తండ్రి అనంతన్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా, తమిళనాడు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడిగా పనిచేశారు. చెన్నైలోని మద్రాసు కాలేజీలో మెడిసిన్ చేసిన తమిళిసై రామచంద్ర మెడికల్‌ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వైద్యుడైన సౌందర రాజన్‌ను వివాహం చేసుకున్న ఆమె పలు ఆస్పత్రులకు విజిటింగ్‌ కన్సల్టెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

స్టూడెంట్‌ లీడర్‌గా రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చినా బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ విభాగంలో వివిధ స్థాయిల్లో సేవలందించారు. 2014 ఆగస్టు 16 న తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే గతంలో ఆమె రెండు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేదు.

Next Story

లైవ్ టీవి


Share it