పెళ్లిలో కరోనా వైరస్ స్తోత్రాలు

పెళ్లిలో కరోనా వైరస్ స్తోత్రాలు
x
Corona Effect In marriage
Highlights

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో చర్యలను చేపట్టాయి.

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో చర్యలను చేపట్టాయి.ఇందులో భాగంగానే రాష్ట్రంలోని బాధ్యతగల పౌరులు, పదవిలో ఉన్న నాయకుడు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న కొంత మంది ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సగ్నల్ వద్ద వాహనదారులకు రోడ్డుపైనే అవగాహన కల్పించారు. బస్టాపుల్లోనే, రైల్వేస్టేషన్లలోనూ, ఇదే పనిగా కరోనా వైరస్ పట్ల తీసుకునే చర్యలను గురించి వివరిస్తున్నారు. గ్రామాల్లో చూసుకుంటే 144 సెక్షన్ కర్ఫ్వూ విధించనట్టువంటి చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఓ గ్రామసర్పంచ్, అధికారులు కరోనా పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పెల్లి ల్లో, ఫంక్షన్లలో, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెల్లి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కోణంలోనే ఓ పెండ్లి మండపంలో వధూవరులను ఒక్కటి చేసే వేదమంత్రాలతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పురోహితుని ద్వారా చెప్పించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామ పంచాయతీ పరిధిలో అదే ఊరికి చెందిన వారి ఇంట్లో ఓ పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పెద్దేముల్ సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ ఆర్‌ఐ రాజిరెడ్డి, మాజీ సర్పంచి కిషన్ రావు, పంచాయతీ సెక్రెటరీ ఉమారాణి వివాహ మండపానికి వచ్చారు. ఆ శుభకార్యం ముగిసిన తరువాత వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలిపారు. పురోహితుడు శివానందం ద్వారా అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఇస్తున్న అన్ని సూచనలు పాటిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ సూచన మేరకు ఆదివారం రోజున అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని అన్నారు. ఆదివారం రోజున ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఎవరూ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లవద్దని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories