వాటెన్ ఐడియా.. అదరహో అనిపిస్తోన్న నులి వెచ్చని గోనెసంచి స్వెట్టర్‌

వాటెన్ ఐడియా.. అదరహో అనిపిస్తోన్న నులి వెచ్చని గోనెసంచి స్వెట్టర్‌
x
Highlights

ఒక ఐడియాతో అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు. మొన్నటి వరకు ఎవరో కూడా తెలియని ఆయన ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయాడు. మేధావులనే మించినోడుగా డిజైనర్లనే...

ఒక ఐడియాతో అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు. మొన్నటి వరకు ఎవరో కూడా తెలియని ఆయన ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయాడు. మేధావులనే మించినోడుగా డిజైనర్లనే తలదన్నేలా అద్భతం చేసి ప్రశంసలు అందుకున్నారు. వెస్టీజీతో అద్భుతం చేసి ఔరా అనిపించాడు. అతగాడి చేతులు చేసిన ఆ అద్భుత పనేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే.

చలి వణికించగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్వెట్టర్‌. వెచ్చదనాన్ని ఇచ్చే స్వెట్టర్‌ను ఏ మూల ఉన్నా వెలికితీస్తాం. లేకుంటే మార్కెట్‌లో కొనుగోలు చేస్తాం. ఎందుకంటే చలికాలం ధరించకుంటే రాత్రి సుఖంగా నిద్రపోవడం కూడా కష్టమే. చలి తీవ్రత పెరిగితే చాలు వెచ్చని స్వెట్టర్లు, జర్కిన్లపై అందరి కన్నుపడుతోంది. మార్కెట్‌లో లభించే వివిధ బ్రాండులు కొనేందుకు పరుగులు పెడతాం. ఖరీదైన చలికోట్‌ను కొనలేని వాళ్లు వెచ్చదనం కోసం గోనె సంచులను కప్పుకుంటారు. అచ్చం ఓ పెద్దాయన ఈ ఫార్మాలాను ఫాలో అయి ఫేమస్‌ అయ్యాడు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు. నిజమే పురాతన వస్తువులే పుడమి తల్లిని కాపాడుతాయి. అందులో డౌటే లేదని నిరూపించాడు జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. మాల్యాల మండలం తాటిపట్టికి చెందిన ఓ యువకుడికి ఓ ఐడియా వచ్చింది. స్వతహాగా టైలర్‌ అయిన మోహన్‌ గొనె సంచులతో అందమైన వెచ్చనైన బ్లేజర్ తయారు చేశాడు. మూడు గోనె సంచులతో మూడు గంటల్లో అదిరిపోయే బ్లేజర్ తయారు చేశాడు. అలా గోనె సంచులతో కోట్‌ కుట్టి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఓ వ్యక్తి వద్ద మూడు గోనె సంచులను 10 రూపాయలకు కొని వాటితో బ్లేజర్ తయారు చేశాడు. అతి తక్కువ ధరకే స్వెటర్‌ లభిస్తోందని అంటున్నారు. ఎటు చూసినా ప్లాస్టిక్ మయం కావడంతో ప్లాస్టిక్ యుగంలా మారిపోయిన ఈరోజుల్లో మోహన్‌ చేసిన అద్భుతమైన గొనేసంచి కోట్‌ అందరిని కట్టిపడేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories