Top
logo

కొనసాగుతోన్న తహశీల్దార్ విజయ రెడ్డి హత్య కేసు విచారణ

Vijaya ReddyVijaya Reddy
Highlights

తహశీల్దార్ విజయ రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. వనస్థలిపురం ఏసీపీ జయరాంను ఈ కేసు విచారణ అధికారిగా రాచకొండ సీీీపీ మహేశ్ భగవత్ నియమించారు

తహశీల్దార్ విజయ రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. వనస్థలిపురం ఏసీపీ జయరాంను ఈ కేసు విచారణ అధికారిగా రాచకొండ సీీీపీ మహేశ్ భగవత్ నియమించారు. చికిత్స పొందుతూ విజయరెడ్డి డ్రైవర్ మృతి చెండదంతో కేసులోని సెక్షన్లను మార్పు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

మరోవైపు విజయ రెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి సీిరియస్ గా వుంది. 65 శాతం కాలిపోయి సురేష్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. శరీరంలో నీరంతా ఇంకిపోవడంతో సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు.

సురేష్ కాల్ డేటాను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. విజయ రెడ్డిని హత్యకు ముందు సురేష్ తన పెద్ద నాన్నతో పాటు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించారు. సురేష్ కుటుంబానికి చెందిన 9 ఎకరాల భూవివాదమే విజయరెడ్డి హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఈ భూ వివాదంపై గ్రామ సభల్లో తహశీల్దార్, ఇతర అధికారులతో సురేష్ వాగ్వాదం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సురేష‌ తండ్రి, పెద్దనాన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనస్థలంలో సురేష్ తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయరెడ్డి హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story