Top
logo

తెలంగాణలో దడపుట్టిస్తున్న స్వైన్ ఫ్లూ

తెలంగాణలో దడపుట్టిస్తున్న స్వైన్ ఫ్లూ
Highlights

తెలంగాణలో వైరల్ ఫీవర్స్ తో పాటు స్వైన్ ఫ్లూ దడ పుట్టిస్తోంది కొన్ని రోజులుగా విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు...

తెలంగాణలో వైరల్ ఫీవర్స్ తో పాటు స్వైన్ ఫ్లూ దడ పుట్టిస్తోంది కొన్ని రోజులుగా విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధుల భారీన పడుతున్న వారి సంఖ్యతో పాటు స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళ చెందుతున్నారు.

తెలంగాణను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. విషజ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతుండగా తాజాగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా పట్టి పీడిస్తుండగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. చలి అధికంగా ఉండటంతో విస్తరిస్తున్న స్వైన్ ప్లూతో చాలా మంది మంచాన భారీన పడుతున్నారు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో వారానికి మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా వాతావారణంలో వస్తున్న మార్పుతో చలి తీవ్రత తోడవడంతో స్వైన్ ఫ్లూ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. H1,N1 పరీక్షలు జరిపించాలని పాజిటివ్ వస్తే స్వైన్ ఫ్లూగా నిర్ధరిస్తారని వైద్యులు చెబుతున్నారు. తరచూ జ్వరం రావడంతో పాటు గొంత నొప్పి, ఒళ్లు నొప్పుల, దగ్గు వస్తుంటే వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలకు స్వైన్ ఫ్లూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.

వివిధ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వస్తున్న వారి బ్లడ్ షాంపిల్స్ సేకరిస్తూ ఐపీఎం ల్యాబ్ లో పరీక్షలు జరుపుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు దీర్గకాళిక వ్యాధులతో బాధపడే వారు HIV పేషంట్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


Next Story