టమాటాలు అనుకునేరు.. కాదు, కొత్తరకం పండ్లు!

టమాటాలు అనుకునేరు.. కాదు, కొత్తరకం పండ్లు!
x
Highlights

మనిషిని పోలిన మనుషులు వున్నట్టుగానే ఇప్పుడు కూరగాయల లాంటి పండ్లు, పండ్ల లాంటి కూరగాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. అటువంటిదే ఈ టమాటా ను పోలిన పండు.. నిజామాబాద్ మార్కెట్ లో ఇది ఇటీవల ప్రత్యక్షం అయింది.

మనిషిని పోలిన మనుషులు వున్నట్టుగానే ఇప్పుడు కూరగాయల లాంటి పండ్లు, పండ్ల లాంటి కూరగాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిలో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది టమాటా ను పోలినట్టు ఉన్న పండు ఒకటి. చూడ్డానికి అచ్చం టమాటా లానే ఉంటుంది.. కానీ, ఇది కూరకు పనికిరాదు. కేవలం పండుగానే ఉపయోగించవచ్చు. తీయటి రుచితో ఉన్న ఈ పండు తిన్న వారు మళ్లీ మళ్లీ తినాలని చూస్తున్నారంటే దీని రుచిని గురించి తెలుసుకోవచ్చు.

ఈ మధ్య టమాటాల రూపంలో ఉన్న స్వీట్‌ ఓమర్‌ పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇటీవల నిజామాబాద్‌ పట్టణంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలోని మార్కెట్లో తోపుడు బండ్లపై ఈ పండ్లను అమ్ముతున్నారు. వీటిని చూసిన ప్రజలు అవి టమాటాలు అనుకుంటున్నారు. అయితే, ఆ వ్యాపారులు ఇవి పండ్లు అని చెప్పి రుచి చూపించి కొనిపిస్తున్నారు. ధర కొంచెం అధికం అనిపించినా.. రుచిగా ఉండడం.. కొత్త వెరైటీ కావడంతో అమ్మకాలూ జోరుగానే సాగుతున్నాయి. నాలుగు పళ్ళు 100 రూపాయలకు వీరు ఇక్కడ అమ్ముతున్నారు. వీటిని కాశ్మీర్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు వారు చెప్పారు.

ఇంత రుచికరమైన ఈ పండ్లకు మొదట్లో ఏ పేరు ఉండేదనే విషయంపై కచ్చితమైన సమాచారం లేదు కానీ, 1996 లో యూఎస్ఏ లో చదువుకుంటున్న ఒక లెబనాన్ విద్యార్ధి అక్కడ పరిచయం చేశాడు. అతని పేరు ఒమర్. దీంతో అక్కడ వారు ఈ పండును ఒమర్ అని పిలవడం మొదలెట్టారు. అక్కడి నుంచి ఇవి ఒమర్ గా ప్రాచుర్యం లోకి వచ్చినట్టు ఇంటర్నెట్ లో కొంత సమాచారం ఉంది.

ఏదిఏమైనా ఒక కొత్త పండు మన మార్కెట్ లో ప్రత్యక్షం అయింది. అన్నట్టు టమాటాలు కొనేటప్పుడు చూసుకోండి.. ఒకవేళ ఒమర్ గానీ కలిసిందేమో..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories