ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయాధికారం కమిటీదే!

ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయాధికారం కమిటీదే!
x
Highlights

ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయాధికారం రుసుముల నియంత్రణ కమిటీదే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణా హైకోర్ట్ ఈ విషయంలో తన పరిధి దాటిందని...

ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయాధికారం రుసుముల నియంత్రణ కమిటీదే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణా హైకోర్ట్ ఈ విషయంలో తన పరిధి దాటిందని అభిప్రాయపడింది. వాసవి, శ్రీనిధి కళాశాలల ఫీజుల పెంపు విషయంలో గతంలో తెలంగాణా హైకోర్ట్ ఫీజులు పెంచుకోవడానికి వీలుగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఊరట కలిగించే అంశమే.

విషయం ఇదీ..

ఇంజనీరింగ కళాశాలల్లో ఫీజులు ఏ విధంగా ఉండాలనే అంశంలో ప్రతి మూడేళ్ళకు ఒకసారి రుసుముల నియంత్రణ కమిటీ నిర్ణయిస్తుంది. అదే విధంగా 2016 లో ఫీజులను ఖరారు చేసింది. అయితే, వాటిని సమ్మతించని శ్రీనిధి, వాసవి, సీబీఐటీ, ఎంజీఐటీ కళాశాలలు 2016లో హైకోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కళాశాలలు ప్రతిపాదించుకున్న రుసుములను వసూలు చేసుకోవచ్చని.. అయితే అది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని 2018లో తీర్పునిచ్చింది. దాంతో ఆయా కళాశాలల్లో ఫీజులు భారీగా పెంచారు. ఇది విద్యార్థుల తల్లి దండ్రులకు ఇబ్బందులు కలిగించడంతో పేరెంట్స్ అసోసియేషన్లు, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపధ్యంలో ఈ విషయంలో సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీం కోర్టు కళాశాలల్లో ఫీజుల నియంత్రణ రుసుముల నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలోనే ఉండాలని తీర్పు ఇచ్చింది. సోమవారం ఈ కేసులో సుప్రీం జస్టిస్‌ నవీన్‌ సిన్హా తీర్పును వెలువరించారు. ''రుసుముల విషయంలో నియంత్రణ కమిటీ సిఫార్సుల్లో హైకోర్టు జోక్యం చేసుకుంది. నిర్ణయం తీసుకొనే అంశంపైనే సమీక్ష ఉంటుంది కానీ తీసుకొన్న నిర్ణయంలో మెరిట్‌పైన కాదు. న్యాయ సమీక్ష పేరుతో రుసుముల నియంత్రణ కమిటీ పరిధిలోకి వెళ్లి కోర్టులు నిర్ణయం తీసుకోకూడదు. నిపుణుల కమిటీ సిఫార్సుల్లో జోక్యం చేసుకోకూడదు'' అని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories