మద్యం దొరక్క వింత ప్రవర్తనలు, ఆత్మహత్యలు..

మద్యం దొరక్క వింత ప్రవర్తనలు, ఆత్మహత్యలు..
x
Highlights

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం సమర్ధంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం సమర్ధంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది.రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం సమర్ధంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది.
ఈ నేపద్యంలోనే రవాణా వ్యవస్థను, షాపులను, కార్యాలయాలను, పాఠశాలలను పూర్తిగా బంద్ చేసారు. ఇందులో భాగంగానే వైన్ షాపులను కూడా పూర్తిగా మూసి వేసారు. కానీ తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి లక్షల్లో బానిసలు అయినవారు ఉన్నారు. ఈ మందు బాబులకు చుక్క దొరక్క ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

వారం రోజుల వరకు పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో మందుబాబుల పిచ్చి చేష్టలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు మందు తాగడానికి అలవాటు పడి ఉండడంతో ఒక్క సారిగా అది దొరక్కపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాదు కొంత మంది ఆత్మహత్యా ప్రయత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు ఆత్మహత్య కేసులు నమోదు కాగా ఒకరు ఫిట్స్ వచ్చి మరణించారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఇందూరుకు చెందిన వారు ఇద్దరు, జామాబాద్‌ లో ఇద్దరు ఉన్నారు.

ఇక పోతే నగరంలోని 45 ఏల్ల వ్యక్తి మద్యం దొరకక పోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారి తెలిపారు. అంతే కాక నగరంలోని ముదిరాజ్‌ వీధిలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మద్యం దొకకపోవడంతో వింతగా ప్రవర్తించి ఫిట్స్‌ వచ్చి చనిపోయారని తెలిపారు. ఇక ఇదే నేపథ్యంలో సాయినగర్‌ కాలనీలో నివాసముంటున్న మద్యానికి బానిసైన 65 ఏళ్ల ఓ మహిళ వారం రోజులుగా కల్లు అందుబాటులో లేక పోవడంతో ఫినాయిల్ తాగి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. మద్యానికి బానిసై ఒక్క సారిగా మందు దొరకక పోవడంతో రెండు రోజుల నుంచి ఆమె వింతగా ప్రవర్తించిందని, ఆ పిచ్చితనంలోనే ఆమె, శుక్రవారం రాత్రి ఇంట్లో అందుబాటులో ఉన్న ఫినాయిల్‌ తాగిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలాంటి వారిక మద్యం మరిన్ని రోజులు అందుబాటులో లేకపోతే ఇంకా ఎంత మంది ఇలా పిచ్చిలేసినట్టుగా ప్రవర్తిస్తారో, ఇంకా ఎన్నిమరణాల సంఖ్య పెరుగుతుందో అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories